శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 09:56:29

జాతీయ జెండాను పోలిన మాస్కుల‌ను నిషేదించండి : దిగంబ‌ర్ కామ‌త్

జాతీయ జెండాను పోలిన మాస్కుల‌ను నిషేదించండి : దిగంబ‌ర్ కామ‌త్

ప‌నాజీ : జాతీయ జెండాను పోలిన మాస్కుల‌ను నిషేదించాల్సిందిగా గోవా మాజీ సీఎం దిగంబ‌ర్ కామ‌త్ డిమాండ్ చేశారు. అశోక‌చ‌క్రంతో కూడిన త్రివ‌ర్ణ ప‌తాకాన్ని పోలిన మాస్కుల‌ను చూసిన ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. ఇటువంటి మాస్కుల‌ను చూసి ఎంతో బాధ‌ప‌డ్డ‌ట్లు తెలిపారు. ఆగ‌స్టు 15కి ముందు జాతీయ‌జెండాను పోలిన మాస్కుల‌ను విక్ర‌యించ‌డాన్ని ఆయ‌న నిర‌సించారు. ఈ మేర‌కు అన్ని రాష్ర్టాల‌కు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరుతూ ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యాన్ని కోరారు. జాతీయ ప‌తాకాన్ని మ‌న‌మంద‌రం గౌర‌విద్దామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. logo