గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 08:58:49

మ‌రోమారు స్వ‌ల్పంగా త‌గ్గిన డీజిల్ ధ‌ర‌

మ‌రోమారు స్వ‌ల్పంగా త‌గ్గిన డీజిల్ ధ‌ర‌

న్యూఢిల్లీ: వ‌రుస‌గా పెరిగిన డీజిల్ ధ‌ర‌లు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. నిన్న మెట్రోన‌గ‌రాల్లో 20 పైస‌ల వ‌ర‌కు త‌గ్గిన ధ‌ర‌లు, మ‌ళ్లీ 14-15 పైస‌లు దిగివ‌చ్చాయి. రోజువారీ స‌మీక్ష‌లో భాగంగా డీజిల్ ధ‌ర‌ల‌ను స్వ‌ల్పంగా త‌గ్గించిన దేశీయ చ‌మురు కంపెనీలు, పెట్రోల్ ధ‌ర‌లో ఎలాంటి మార్పులు చేయ‌లేదు. అయితే కోల్‌క‌తాలో మాత్రం 2 పైస‌లు పెరిగాయి. 

ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గ‌డంతో దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో లీటర్ ధ‌ర రూ.71.43గా ఉండ‌గా, పెట్రోల్ ధ‌ర రూ.81.14గా ఉన్న‌ది. డీజిల్ ధ‌ర నిన్న రూ.71.58గా ఉంది. అదేవిధంగా మెట్రోన‌గ‌రాలైన కోల్‌క‌తాలో లీట‌ర్ పెట్రోలు రూ.82.67, డీజిల్ రూ.74.94, ముంబైలో పెట్రోల్‌ రూ.87.82, డీజిల్ రూ.77.87, చెన్నై పెట్రోల్ ధ‌ర రూ.84.21, డీజిల్ ధ‌ర రూ.76.85గా ఉన్న‌ది.  


logo