శుక్రవారం 10 జూలై 2020
National - Jun 28, 2020 , 12:35:27

21 రోజుల్లో రూ.11 పెరిగిన డీజిల్‌ ధర..

21 రోజుల్లో రూ.11 పెరిగిన డీజిల్‌ ధర..

కరోనా మహమ్మారితో ఉపాధి లేక ముందే జనం నానా ఇబ్బందులు పడుతుంటే పెట్రో ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రతిరోజు పెరుగుతుండడంతో భారత్‌ నిజమైన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. 21 రోజుల నుంచి ప్రతిరోజు పైసల్లో పెరుగుతున్న పెట్రో ధరలు ఆదివారం పెరుగలేదు. 

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.80.38 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.40కు చేరింది. 21రోజులుగా ప్రతిరోజు పెట్రో ధరలు పెరుగుతుండడంతో డీజల్‌పై రూ.11, పెట్రోల్‌పై రూ.9 అదనంగా పెరిగింది. పెట్రో ధరలు భారీగా పెరుగుతుండడంతో దీన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఫ్రంట్‌ను తెలిచాయి. 

ప్రజలు సంక్షోభంతో పోరాడుతున్న తరుణంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును కాంగ్రెస్‌ తీవ్రంగా విమర్శించింది. గత ఆరేండ్లలో విధించిన పన్నును ఉపసంహరించుకోవాలని, చమురు ధరలను తగ్గించాలని కాంగ్రెస్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ముడిచమురు ధరలు నిరంతరం పడిపోతున్న తీరును తమకు వివరించాలని డిమాండ్‌ చేసింది 


logo