ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 10:06:38

డీజిల్‌ మరింత ప్రియం.. రూ.81.58కు చేరిన ధర

డీజిల్‌ మరింత ప్రియం.. రూ.81.58కు చేరిన ధర

న్యూఢిల్లీ: డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రవాణా రంగంలో అత్యధికంగా ఉపయోగించే డీజిల్‌పై చమురు కంపెనీలు ప్రతిరోజు ఎంతో కొంత వడ్డిస్తూ వస్తున్నాయి. రోజువారి ధరల సమీక్షలో భాగంగా లీటర్‌ డీజిల్‌పై 17 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.81.58కు చేరింది. అయితే పెట్రోల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గత నెల 29 నుంచి పెట్రోల్‌ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.47గా ఉన్నది. అంటే పెట్రోల్‌ కంటే డీజిల్‌ ధర రూ.1.11 ఎక్కువగా ఉన్నది. 

జూన్‌ 7 నుంచి వరుసగా 22 రోజులపాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. అయితే జూన్‌ 29న పెట్రోల్‌ ధరను మార్చకుండా, డీజిల్‌ ధరను మాత్రమే చమురు కంపెనీలు పెంచాయి. మళ్లీ గత నాలుగు రోజుల నుంచి వరుసగా డీజిల్‌ ధరలు పెరుగుతూ వస్తున్నాయి.


logo