గురువారం 02 జూలై 2020
National - Jun 25, 2020 , 07:01:54

రూ.80 దాటిన డీజిల్‌ ధర

రూ.80 దాటిన డీజిల్‌ ధర

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో మొదటిసారిగా డీజిల్‌ ధరలు రూ.80 మార్కుని దాటాయి. జూన్‌ 7న ప్రారంభమైన ఈ ధరల పెంపు వరుసగా 19వ రోజూ కోనసాగింది. రోజువారీ సమీక్షలో భాగంగా చమురు కంపెనీలు ధరల పెంపు నుంచి బుధవారం పెట్రోల్‌కు మినహాయింపునిచ్చాయి. అయితే ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. లీటర్‌ పెట్రోల్‌పై 16 పైసలు, డీజిల్‌పై 14 పైసలు వినియోగదారునిపై వడ్డించాయి. దీంతో ఢిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.80.02కి చేరగా, పెట్రోల్‌ ధర రూ.79.92కి పెరింగింది. చరిత్రలో మొదటి సారిగా పెట్రోల్‌ కంటే డీజిల్‌ ధరలు పెరిగాయి. వరుసగా రెండో రోజు కూడా పెట్రోల్‌ కంటే డీజిల్‌ ధర 10 పైసలు అధికంగా ఉన్నది.


logo