ఆదివారం 05 జూలై 2020
National - Jun 25, 2020 , 02:29:00

పెట్రోల్‌ కన్నా డీజిల్‌ ధరే ఎక్కువ

పెట్రోల్‌ కన్నా డీజిల్‌ ధరే ఎక్కువ

న్యూఢిల్లీ, జూన్‌ 24: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారిగా పెట్రోల్‌ కంటే డీజిల్‌ ధరే ఎక్కువగా ఉన్నది. వరుసగా 18వ రోజు బుధవారం కూడా డీజిల్‌ ధర 48 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.79.88కి చేరింది. ఇదే సమయంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.79.76 పలుకుతున్నది. అయితే రాష్ర్టాల్లో స్థానిక పన్నులను బట్టి పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పులు ఉండనున్నాయి.


logo