గురువారం 09 జూలై 2020
National - Jun 16, 2020 , 21:44:35

ఆశ్చ‌ర్యం! చెట్టుని న‌రికితే నీళ్లు వ‌స్తున్నాయి

ఆశ్చ‌ర్యం! చెట్టుని న‌రికితే నీళ్లు వ‌స్తున్నాయి

ప్ర‌కృతి అందాల‌ను చూడాలే కాని ఎన్నుంటాయో. దీని గురించి వ‌ర్ణించ‌డానికి కూడా మాట‌లు రావు. ప్ర‌కృతి గురించి చెప్ప‌డం కంటే ఒక్కోసారి చూసి త‌రిస్తేనే బాగుంటుంది. చాలాసార్లు చెట్లును న‌రికిన‌ప్పుడు దాని నుంచి పాలు కార‌డం లాంటి సంఘ‌ట‌న‌లు చూసే ఉన్నాం. కానీ త‌మిళ‌నాడులోని ఒక చెట్టును క‌త్తితో న‌రికితే.. నీళ్లు కారుతున్నాయి.

ఐఎఫ్ఎస్ అధికారి దిగ్విజయ్ సింగ్ ఖాటీ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టుచేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ చెట్టును క‌త్తితో నరకగానే.. బెలూన్‌కు కన్నం పడ‌గానే నీళ్లు ఒక్క‌సారిగా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లుగా వస్తున్నాయి. ఈ చెట్లను టెర్మినాలియా టోమెంటోసా అంటారని, ఇవి కాండాల్లో నీటిని నిల్వ ఉంచుకుంటాయని అధికారులు తెలిపారు. ఈ చెట్లను అశాన్, అశ్నా, సజ్ అని కూడా పిలుస్తారు.


logo