శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 16:59:45

ఆ కార‌ణంతో మేక‌ను అరెస్ట్ చేసిన పోలీసులు!

ఆ కార‌ణంతో మేక‌ను అరెస్ట్ చేసిన పోలీసులు!

క‌రోనా నేపథ్యంలో పోలీసులు, డాక్ట‌ర్లు, కార్మికులు నిత్యం పోరాడుతూనే ఉన్నారు. ఈ టైంలో పోలీసులు రియ‌ల్ హీరోలుగా నిలిచారు. కానీ కొంత‌మంది పోలీసులు మాత్రం ప్ర‌జ‌ల ప‌ట్ల ఘోరంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసులు ఒక మేక‌ను అరెస్ట్ చేశారు. ఎందుకు చేశారు అని అడిగితే రోడ్డు మీద న‌డుస్తూ మాస్క్ ధ‌రించ‌లేద‌ని స‌మాధానం ఇచ్చారు. ఇప్పుడు ఈ సంఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్న‌ది.

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని కాన్పూర్, బిక‌న్‌గంజ్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. ఓ వ్య‌క్తి త‌న మేక‌ను తీసుకొని రోడ్డు మీద న‌డుస్తుండ‌గా పోలీసులు అత‌న్ని అడ్డుకున్నారు. తిరుగుతున్న మేక‌ను అరెస్ట్ చేశారు. ఆ భ‌యంతో అక్కడ నుంచి పారిపోయిన య‌జ‌మాని మేక‌కోసం స్టేష‌న్‌కు పోక‌త‌ప్ప‌లేదు. సార్ నా మేక‌ను ఎందుకు అరెస్ట్ చేశారు అని అడిగితే.. 'మేక మాస్క్ లేకుండా బ‌య‌ట తిరుగుతుంది. అందుకే అరెస్ట్ చేశాం' అని స‌మాధానం ఇచ్చారు. దీంతో ఆ య‌జ‌మాని నోరెళ్ల‌బెట్టాడు. త‌ప్పు అయిపోయింది సార్ మ‌ళ్లీ ఇలా జ‌ర‌గ‌కుండా చూసుకుంటాన‌ని బ‌తిమిలాడి ఎలాగోల మేక‌ను విడిపించుకున్నాడు. కానీ యూపీ పోలీసుల మీద మాత్రం సోష‌ల్ మీడియాలో తెగ ట్రోల్స్ అవుతున్నాయి. దీనికి వారు.. రివ‌ర్స్ డ్రామా ఆడారు. మేక య‌జ‌మాని మాస్క్ పెట్టుకోక‌పోవ‌డంతో అత‌న్ని అరెస్ట్ చేసేలోపు ప‌రార్ అయ్యాడు. అందుక‌ని మేక‌ను తీసుకురావాల్సి వ‌చ్చింద‌ని క‌వ‌ర్ చేసుకున్నారు పోలీసులు.logo