శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 20:46:01

ఆర్ఎంఆర్‌సీ బృందాన్ని స‌న్మానించిన అధికారులు

ఆర్ఎంఆర్‌సీ బృందాన్ని స‌న్మానించిన అధికారులు

డిబ్రూగఢ్ : కొవిడ్‌-19 వైరస్ (సార్స్-కొవ్‌‌-2)ను విజయవంతంగా ఐసోలేట్ చేసినందుకు లాహోల్‌లోని రీజిన‌ల్ మెడిక‌ల్ రీసెర్చ్ సెంట‌ర్ (ఆర్ఎంఆర్‌సీ) బృందాన్ని డిబ్రూగఢ్ జిల్లా యంత్రాంగం ఆదివారం స‌త్క‌రించింది.  ఈ మేర‌కు ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇది క‌రోనా వైర‌స్‌కు వ్య‌తిరేకంగా వ్యాక్సిన్ అభివృద్ధిలో తొలి అడుగుగా పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా విజ‌యం సాధించిన బృందానికి పుష్ప‌గుచ్ఛం అందించి, శుభాకాంక్ష‌లు తెలిపారు. డిప్యూటీ కమిషనర్ పల్లవి గోపాల్ ఝా, అదనపు డిప్యూటీ కమిషనర్ దీపూ కుమార్ దేకా, ఆరోగ్య సేవల జాయింట్ డైరెక్టర్ డాక్టర్ నబజ్యోతి గొగోయ్, ఎన్‌హెచ్ఎం అధికారులు ఆర్ ఎంఆర్ సీ డైరెక్టర్ డాక్టర్ కె.నారాయణ, శాస్త్రవేత్త, నోడల్ అధికారి డాక్టర్ బిశ్వజ్యోతి బొర్కాకోటి బృందాన్ని స‌త్క‌రించారు. అలాగే విజయం కోసం రాత్రింబవళ్లు చేస్తున్న కృషిని కొనియాడారు.


logo