ఆదివారం 07 మార్చి 2021
National - Jan 15, 2021 , 23:25:19

రామ మందిరానికి వజ్రాల వ్యాపారుల రూ.17 కోట్ల విరాళాలు

రామ మందిరానికి వజ్రాల వ్యాపారుల రూ.17 కోట్ల  విరాళాలు

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించనున్న రామ మందిరానికి విరాళాల హోరు కొనసాగుతున్నది. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు, విశ్వ హిందూపరిషత్‌ (వీహెచ్పీ) సంయుక్తంగా రామ మందిరం నిర్మాణం కోసం విరాళాలను సేకరిస్తున్నాయి.

గుజరాత్‌లోని సూరత్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వజ్రాల వ్యాపారులు గోవింద్‌ భాయ్‌ దోలాకియా రూ.11 కోట్లు, మహేశ్‌ కబూతర్‌వాలా రూ.5 కోట్లు, లవ్‌జీ బాద్‌షా రూ. కోటి విరాళం ఇచ్చారు. అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తన వంతుగా రూ. 5,00, 100 విరాళం అందజేశారు. 

సంక్రాంతి సందర్భంగా గురువారం నుంచి విరాళాల సేకరణ ప్రారంభించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్‌ దేవ్‌ మహరాజ్‌, వీహెచ్పీ కార్య నిర్వాహక అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ మొదలైంది. వచ్చే నెల 27 వరకు దేశవ్యాప్తంగా ఐదు లక్షల గ్రామాల నుంచి రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరించనున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo