అయోధ్య రామాలయానికి వజ్రాల వ్యాపారి రూ.11 కోట్ల విరాళం

అహ్మదాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించనున్న భవ్య రామాలయం నిర్మాణానికి విరివిగా విరాళాలు అందుతున్నాయి. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్‌భాయ్ ధోలాకియా రూ.11 కోట్లు విరాళంగా ఇచ్చారు. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కార్యాలయానికి వచ్చిన ఆయన ఈ మేరకు బ్యాంకు చెక్‌ను శుక్రవారం అందజేశారు. రామకృష్ణ డైమండ్స్ యజమాని అయిన గోవింద్‌భాయ్ ధోలాకియాకు గత కొంతకాలంగా ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉన్నది.
మరోవైపు అయోధ్యలో రామాలయం నిర్మాణానికి గుజరాత్‌కు చెందిన పలువురు వ్యాపారులు కూడా విరాళాలు అందించారు. సూరత్‌కు చెందిన మహేష్ కబూతర్‌వాలా రూ.5 కోట్లు, లవ్జీ బాద్షా రామ్ రూ.1 కోటి విరాళంగా ఇచ్చారు. వీరే కాకుండా గుజరాత్‌లోని అనేక మంది వ్యాపారులు రూ.5 నుంచి రూ.21 లక్షల వరకు విరాళాలు అందజేశారు.
అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం వీహెచ్, ఆర్ఎస్ఎస్కు చెందిన సభ్యులు శుక్రవారం నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తొలి విరాళంగా రూ.5,00,100 చెక్‌ను శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్‌కు అందజేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.