ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 11, 2020 , 17:59:05

భార్య దెబ్బ‌ల‌కి భ‌ర్త‌ కుడి భుజం విరిగింది.. కార‌ణం తెలిస్తే న‌వ్వాపుకోలేరు!

భార్య దెబ్బ‌ల‌కి భ‌ర్త‌ కుడి భుజం విరిగింది.. కార‌ణం తెలిస్తే న‌వ్వాపుకోలేరు!

ఇరుగుపొరుగు వారి గొడ‌వ‌లు భ‌లే ఉంటాయి. ప‌‌క్కింటివాళ్లు తిట్టుకుంటుంటే కొంత‌మంది భ‌లే ఎంజాయ్ చేస్తుంటారు. కానీ భార్య‌భ‌ర్త‌లు గొడ‌వ ప‌డితే కొంచెం భ‌య‌ప‌డుతారు. ఎందుకంటే ఇద్ద‌రే ఉంటారు. బ‌లం ఎక్కువ ఉన్న‌వారు అవ‌త‌ల వారిని చిత‌క్కొట్టేస్తారు. అది భ‌ర్త అయినా భార్య అయినా. ఒక‌ప్పుడు భ‌ర్త, భార్య‌ను కొట్టేవాడు. ఇప్పుడు ట్రెండ్ మారింది గురూ.. భార్యే భ‌ర్త‌ను ఉతికిపారేస్తుంది. దానికి పెద్ద‌గా కార‌ణం కూడా అవ‌స‌రం లేదు. ఒక మాట ఎదురు మాట్లాడితే చాలు. ఇదిగో ఇత‌ని భుజం విరిగిన‌ట్లు విర‌గాల్సిందే.. అస‌లు అత‌ను ఏమ‌న్నాడో తెలుసా..

పాపం హ‌ర్ష‌ద్ అనే అత‌నికి మ‌ధుమేహం ఉంది. కాబ‌ట్టి ఆలూ క‌ర్రీ తిన‌కూడ‌దు. కానీ ఆ రోజు అత‌ని భార్య మాత్రం చ‌పాతీల్లోకి ఆలూ కర్రీ చేసింది. 'ఇది ఎందుకు చేశావు. నేను తిన‌కూడ‌దు అని తెలుసు క‌దా. తెలిసి కూడా కావాల‌నే చేశావు క‌దా' అని అన్నాడంట‌. ఇక చూడు బ‌య‌ట‌కు వెళ్లి బ‌ట్ట‌లు ఉతికే క‌ర్ర‌ను తీసుకొచ్చి భ‌ర్త‌ను ఫ‌ట్‌ఫ‌ట్‌మ‌ని వాయించేసింది. ఆ దెబ్బ‌కి అత‌ని అరుపులు ఇంటి చుట్టుప‌క్క‌లకు వినిపించాయి. వారు వ‌చ్చి కాపాడేంత వ‌ర‌కు అత‌ను దెబ్బ‌లు తింటూనే ఉన్నాడు. త‌ర్వాత అత‌న్ని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. దీంతో హ‌ర్ష‌ద్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. జ‌రిగిందంతా చెప్పి ఎఫ్ఐఆర్ న‌మోదు చేశాడు. ఆ దెబ్బ‌ల‌కు హ‌ర్ష‌ద్ కుడి భుజం విర‌గ‌డంతో పోలీసులు సైతం ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ ఘ‌ట‌న అహ్మదాబాద్‌లోని వాస్నాలో చోటుచేసుకున్న‌ది. 


logo