గురువారం 09 జూలై 2020
National - Jun 16, 2020 , 13:28:11

క‌రోనా క‌ట్ట‌డి కోసం క‌ర్ణాట‌క‌లో ధ‌న్వంత‌రి యాగం

క‌రోనా క‌ట్ట‌డి కోసం క‌ర్ణాట‌క‌లో ధ‌న్వంత‌రి యాగం

బెంగ‌ళూరు: ప‌్ర‌పంచ దేశాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం చేస్తున్న‌ది. దేశంలోనూ క‌రోనా క‌ల‌క‌లం రేపుతున్న‌ది. కేసుల సంఖ్య రోజురోజుకు వేగంగా పెరుగుతుండటంతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌లు ఆస్ప‌త్రుల్లో క‌రోనా రోగుల కోసం ప్ర‌త్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నాయి. అయినా క‌రోనా కేసుల సంఖ్య పెరుగ‌డ‌మే తప్ప త‌గ్గ‌డంలేదు. ఈ నేప‌థ్యంలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గిపోవాల‌ని కోరుతూ క‌ర్ణాట‌క రాష్ట్రం బెంగ‌ళూరులోని శంక‌ర్‌మ‌ఠ్‌లో ధ‌న్వంత‌రీ యాగం నిర్వ‌హించారు. ఈ యాగానికి క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బీఎస్ య‌డ్యూర‌ప్ప‌, ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి కే సుధాక‌ర్ ఈ యాగంలో పాల్గొన్నారు.                                                           logo