గురువారం 02 జూలై 2020
National - Jun 04, 2020 , 20:22:12

నకిలీ విత్తన ముఠాలను ఉక్కుపాదంతో అణిచివేయాలి: డీజీపీ

నకిలీ విత్తన ముఠాలను ఉక్కుపాదంతో అణిచివేయాలి: డీజీపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో నకిలీ విత్తన ముఠాలను ఉక్కుపాదంతో అణిచివేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీస్‌ అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర పోలీస్‌ అధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డితోపాటు పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నకిలీ విత్తనాల అమ్మకాలను అరికట్టడానికి చేపట్టాల్సిన చర్యలపై ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. ఇప్పటికే వానాకాలం సీజన్‌ మొదలైన నేపథ్యంలో నకిలీ విత్తన ముఠాలు చెలరేగుతాయని, ఇలాంటి ముఠాలను ఉక్కుపాదంతో అణిచివేసి రైతులు మోసపోకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డీజీపీ ఆదేశాలు జారీచేశారు.         logo