శనివారం 30 మే 2020
National - May 18, 2020 , 19:42:20

తెరుచుకున్న గోల్డెన్‌ టెంపుల్

తెరుచుకున్న గోల్డెన్‌ టెంపుల్

చండీగఢ్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో అన్ని ప్రార్థనా స్థలాలు, సామూమిక ప్రార్థనలు మూతపడ్డాయి. గత 57 రోజులుగా భక్తులు ఇండ్లకే పరిమితమై ఇంటి నుంచే దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. అయితే, కొవిడ్‌-19 కాస్తా తెరిపి ఇస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూను రాత్రి సమయాలకే పరిమితం చేశారు. అయినప్పటికీ పలు రాష్ట్రాల్లో ఇంకా ఆలయాలు తెరుచుకోలేదు.

పంజాబ్‌ ప్రభుత్వం ప్రార్థనా స్థలాలను తెరిచేందుకు, భక్తులు ప్రార్థనలు చేసుకొనేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వనప్పటికీ.. సోమవారం నుంచి అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం, భద్రకాళి మందిర్‌లు తెరుచుకొన్నాయి. ఆలయాలు తెరుచుకోవడంతో తొలిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలకు బారులుతీరారు. స్వర్ణ దేవాలయానికి చాలా మంది భక్తులు ముఖానికి మాస్క్‌ ధరించకుండానే వచ్చారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ శానిటైజేషన్‌ చేసుకోవడం మరువద్దని ప్రభుత్వం హెచ్చరిస్తున్నది. గోల్డెన్‌ టెంపుల్‌లో డిస్‌ఇన్ఫెక్షన్‌ టన్నెల్స్‌ కూడా అధికారులు ఏర్పాటుచేశారు. స్వర్ణ దేవాలయం ప్రధాన ద్వారం వద్ద స్క్రీనింగ్‌ పరీక్షలు జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.


logo