మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 24, 2020 , 20:13:39

కరోనా పరీక్ష తర్వాతే కామాఖ్యా ఆలయంలోకి భక్తులు

కరోనా పరీక్ష తర్వాతే కామాఖ్యా ఆలయంలోకి భక్తులు

గౌహతి: అసోంలోని ప్రసిద్ధ కామాఖ్యా అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ముందుగా కరోనా పరీక్ష నిర్వహిస్తున్నారు. కరోనా పరీక్ష తర్వాతే అష్టమి పూజ కోసం భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు. మరోవైపు కరోనా నేపథ్యంలో భక్తుల తాకిడి తగ్గింది. కేవలం 5 శాతం మంది భక్తులు మాత్రమే అష్టమి పూజ కోసం ఆలయానికి వచ్చినట్లు పూజారి తెలిపారు. అయితే పూజలు ఇతర కార్యక్రమాలు మాత్రం పూర్తిగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాదికి అంతా బాగుంటుందని కామాఖ్యా ఆలయ పూజారి ఆశాభావం వ్యక్తం చేశారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.