బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 03, 2020 , 09:02:56

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం, టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. శ్రీవారిని నిన్న 69,096 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,383 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 3.09 కోట్లు.


logo
>>>>>>