శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 17, 2020 , 07:47:22

తిరుమల శ్రీవారి దర్శనానికి గంట సమయం

తిరుమల శ్రీవారి దర్శనానికి గంట సమయం

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ చాలా సాధారణంగా ఉంది. కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా టీటీడీ చర్యలు చేపట్టింది. కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా అధికారులు భక్తులకు నేరుగా దర్శనం సౌకర్యం కల్పిస్తున్నారు. భక్తులకు టైమ్‌స్లాట్‌ టోకెన్ల ద్వారా శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. శ్రీనివాసుడి దర్శనానికి గంట సమయం పడుతుంది. తిరుమల, తిరుపతిలో ప్రత్యేక కేంద్రాల ద్వారా టైమ్‌స్లాట్‌ టోకెన్లను జారీ చేస్తున్నారు. స్వామివారిని నిన్న 55,827 మంది భక్తులు దర్శించుకున్నారు. 17,339 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 2.06 కోట్లు.


logo