శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 19, 2020 , 08:36:09

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 4 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 5 గంటల సమయం, టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 70,599 మంది భక్తులు దర్శించుకోగా, 17 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.92 కోట్లు. శ్రీపద్మావతి అమ్మవారిని 22,944 మంది భక్తులు దర్శించుకున్నారు.


logo