మంగళవారం 09 మార్చి 2021
National - Jan 23, 2021 , 08:33:37

అన్నాహజారేతో మహారాష్ట్ర మాజీ సీఎం భేటీ

అన్నాహజారేతో మహారాష్ట్ర మాజీ సీఎం భేటీ

ముంబై : అహ్మద్‌నగర్‌ రాలెగాన్‌ సిద్ధిలో సామాజిక సేవ కార్యకర్త అన్నా హజారేతో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ సమావేశమయ్యారు. వ్యవసాయ రంగంపై ఆయన అభిప్రాయాలను, డిమాండ్లను కేంద్రానికి తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయచట్టాలను నిరసిస్తూ రైతులు ఆందోళన చేస్తున్న వేళ.. రైతుల సమస్యలపై ఈ నెలాఖరులో నిరాహార దీక్ష చేయబోతున్నట్లు అన్నా హజారే ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌కు లేఖ రాశారు. ఈ క్రమంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తనను కోరారని, ఈ మేరకు ఆయనను కలిసినట్లు ఫడ్నవిస్ పేర్కొన్నారు. అన్నా హజారే డిమాండ్లకు పరిష్కారం త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం అన్నా హజారే కొత్త వ్యవసాయ చట్టాలు అప్రజాస్వామికమని, చట్టాలను రూపొందించడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. వ్యవసాయంపై ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

VIDEOS

logo