సోమవారం 30 మార్చి 2020
National - Feb 20, 2020 , 14:46:23

మాజీ సీఎం ఫ‌డ్న‌వీస్‌కు బెయిల్‌

మాజీ సీఎం ఫ‌డ్న‌వీస్‌కు బెయిల్‌

హైద‌రాబాద్‌:  మ‌హారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌కు.. ఇవాళ నాగ‌పూర్ కోర్టు బెయిల్ మంజూరీ చేసింది.  15వేల వ్య‌క్తిగ‌త పూచీక‌త్తుపై ఆయ‌న‌కు బెయిల్ జారీ చేశారు.  2014లో ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో త‌న‌పై పెండింగ్‌లో ఉన్న రెండు క్రిమిన‌ల్ కేసుల గురించి ఫ‌డ్న‌వీస్ వెల్ల‌డంలేదు.  ఆ కేసులో మాజీ సీఎం ఫ‌డ్న‌వీస్‌.. ఇవాళ కోర్టుకు హాజ‌ర‌య్యారు.  కోర్టు ముందు హాజ‌రుకావాలంటూ చీఫ్ మెట్రోపాలిట‌న్ మెజిస్ట్రేట్ పీఎస్ ఇంగ్లీ .. ఇటీవ‌ల బీజేపీ నేత‌కు చివ‌రి అవ‌కాశం ఇచ్చారు. అయితే ఫ‌డ్న‌వీస్ కోర్టుకు హాజ‌రుకావ‌డంతో ఆయ‌న‌కు బెయిల్ ఇచ్చారు. అడ్వ‌కేటు స‌తీశ్ ఏకే ఈ కేసును దాఖ‌లు చేశారు.  ఇదే కేసులో ఫ‌డ్న‌వీస్ నాలుగుసార్లు  కోర్టుకు హాజ‌రుకాలేదు. మార్చి 30వ తేదీన ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ ఉంటుంది. 


logo