గురువారం 26 నవంబర్ 2020
National - Nov 08, 2020 , 12:10:13

ఢిల్లీలో దిగజారుతున్న గాలి నాణ్యత

ఢిల్లీలో దిగజారుతున్న గాలి నాణ్యత

నూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత మరింత దిగజారింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రకారం ఆదివారం గాలి నాణ్యత సూచి తీవ్రస్థాయి విభాగంలో నమోదైంది. ఆనంద్‌ వివాహర్‌లో గాలి నాణ్యత సూచి (ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌- ఏక్యూఐ) 431, జహంగీర్‌పూర్‌ 465, పంజాబీ బాగ్‌లో 426, రోహిణి సెక్టార్‌లో 424గా నమోదైందని చెప్పింది. మయాపురిలో అనేక ప్లాస్టిక్‌ కర్మాగారాలు నడుస్తున్నాయి. దీంతో ఇక్కడ కాలుష్యం పెరుగుతోందని, వాటితో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, సరిగా ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యంతో గొంతు, శ్వాస కోశ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.


51-100 మధ్య సంతృప్తికరంగా, 101-200 మితంగా, 201-300 మధ్య పేలవమైన, 301-400 చాలా పేలవమైన, 401-500 తీవ్రమైన కాలుష్యంగా పరిగణిస్తున్నారు. నిపుణల అభిప్రాయం ప్రకారం.. వాయుకాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఇప్పటికే కరోనా మహమ్మారితో పలువురు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అత్యవసరమ పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో కాలుష్యంతో మరిన్ని ఆరోగ్య పరమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.