బుధవారం 03 జూన్ 2020
National - May 14, 2020 , 17:04:45

రైలెక్కాలంటే వెళ్లే చిరునామా చెప్పాల్సిందే

రైలెక్కాలంటే వెళ్లే చిరునామా చెప్పాల్సిందే

న్యూఢిల్లీ: వలస కూలీలు ప్రత్యేకంగా వేసిన శ్రామిక్ రైళ్లు ఎక్కాలంటే తాము అంతిమంగా వెల్లే గమ్యం ఏమిటో వెల్లడించాల్సిందే. రైల్వేశాఖ ఈ సంగతి స్పష్టం చేసింది. టిక్కెట్లు బుక్ చేసే సమయంలోనే తాము చేరుకునే చిరునామాను ఇవ్వాలని నిబంధన విధించింది. ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మే ఐఆర్‌సీటీసీ ఆ చిరునామాలను నమోదు చేసుకుంటుంది. కరోనా క్లస్టర్ ఏదైనా వెలుగుచూస్తే మనుషులను వెదికి పట్టుకోవడం సులభమవుతుంది అని రైల్వే శాఖ ప్రతినిధి చెప్పారు. గురువారం వరకు 800 శ్రామిక్ రైళ్లు సుమారు 10 లక్షల మంది వలస కార్మికులను గమ్యస్థానాలకు చేరవేశాయని రైల్వే విభాగం వెల్లడించింది. కరోనాకు లాక్‌డౌన్ ముందు, లాక్‌డౌన్ కాలంలో జూన్ 30 వరకు రిజర్వ్ చేసుకున్న అన్ని టికెట్లను రైల్వే విభాగం రద్దు చేసింది. వాటికి సంబంధించిన పూర్తి సొమ్మును వాపసు చేయనున్నది. 15 జతల ప్రత్యేక రైళ్లకు మాత్రం బుకింగ్‌లు జరుగుతున్నాయి.


logo