ఆదివారం 05 జూలై 2020
National - May 27, 2020 , 12:09:28

లవర్‌ను కలిసేందుకు అమ్మాయిలా అవతారమెత్తాడు..

లవర్‌ను కలిసేందుకు అమ్మాయిలా అవతారమెత్తాడు..

సూరత్‌ : ఓ యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు అమ్మాయిలా అవతారమెత్తాడు. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. సూరత్‌లోని పర్ది పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువకుడు.. ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఆ అమ్మాయిని గత కొద్ది రోజుల నుంచి కలుసుకోలేపోయాడు. తన ప్రియురాలని ఎలాగైనా కలవాలని నిర్ణయించుకున్నాడు అతను.

దీంతో సదరు ప్రేమికుడు అమ్మాయిలా అవతారమెత్తాడు. పంజాబీ డ్రెస్‌ ధరించి, ముఖానికి మాస్కుతో పాటు చున్నీని చుట్టుకున్నాడు. ఆ తర్వాత మంగళవారం తెల్లవారుజామున 2:40 గంటల సమయంలో ప్రియురాలికి ఇంటికి స్కూటీపై బయల్దేరాడు. భోస్లపాడ - పరియా రోడ్డులో అతన్ని పోలీసులు ఆపారు. అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నావని పోలీసులు ప్రశ్నించగా, అతను ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. మొత్తానికి తాను చేసిన తప్పును పోలీసుల ఎదుటు ఒప్పుకున్నాడు సదరు యువకుడు. 

తన ప్రియురాలిని కలిసేందుకు వెళ్తున్నానని, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అమ్మాయిలా అవతారమెత్తానని యువకుడు చెప్పాడు. ఒక వేళ ప్రియురాలి తల్లిదండ్రుల కంటపడితే కూడా ఈజీగా తప్పించుకోవచ్చు అని అతను చెప్పాడు. యువకుడి సమాధానం విని పోలీసులు షాక్‌కు గురయ్యారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి అర్ధరాత్రి స్కూటీపై ప్రయాణించిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.  logo