మంగళవారం 07 జూలై 2020
National - May 05, 2020 , 02:16:19

పలు రాష్ర్టాల్లో ఆంక్షల సడలింపు

పలు రాష్ర్టాల్లో ఆంక్షల సడలింపు

  • తెరుచుకున్న దుకాణాలు, కార్యాలయాలు 

న్యూఢిల్లీ: సోమవారం నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ 3.0 అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం కొన్ని మినహాయింపులనిచ్చింది. దీంతో పాటు వివిధ రాష్ర్టాలు కూడా ఆంక్షల్లో పలు సడలింపులనిచ్చాయి. తమిళనాడు, కేరళ, ఒడిశా, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, అసోం తదితర రాష్ర్టాలు ఆంక్షలు సడలించడంతో ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్ల పరిధిలోని క్షౌరశాలలు, ఎలక్ట్రికల్‌ దుకాణాలు, స్టేషనరీ, ఆటోమొబైల్‌ షాపులు సోమవారం తెరుచుకున్నాయి. దీంతో వినియోగదారులు పెద్దఎత్తున కొనుగోళ్లు జరిపారు. రెడ్‌ జోన్‌ బయట ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగులు తమ విధులకు హాజరయ్యారు. ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్ల పరిధిలో తిరిగేందుకు ప్రైవేటు వాహనాలకు అనుమతులనివ్వడంతో పెద్దమొత్తంలో వాహనాలు రోడ్లపైకి వచ్చాయి.


logo