మంగళవారం 14 జూలై 2020
National - Jun 28, 2020 , 20:02:33

జూన్‌2 నుంచి తెరుచుకోనున్న డియోనార్‌ వధశాల

జూన్‌2 నుంచి తెరుచుకోనున్న డియోనార్‌ వధశాల

ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రముఖ డియోనర్‌ వధశాలను జూన్‌ 2నుంచి తెరిచేందుకు బ్రిహాన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అనుమతించింది. జూన్‌ 2నుంచి బర్రెలు, దున్నల రవాణాకు అనుమతి ఉంటుందని, 3న వధించేందుకు అనుమతి ఇస్తామని మున్సిపల్‌ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇప్పటికే లైసెన్స్‌దారులకు, రవాణాదారులకు మార్గదర్శకాలను జారీ చేసింది.

పశువుల రవాణాకు వారంలో 7రోజులు అనుమతిస్తామని వధశాలకు 6రోజులు మాత్రమే అనుమతి ఉంటుందని సూచించింది. మంగళవారం వధశాలను మూసివేయాలని ఆదేశించింది. 24గంటల వ్యవధిలో 300 బర్రెలను/దున్నలను మించకుండా వధించాలని దీని అమలు పూర్తి బాధ్యత లైసెన్స్‌దారులదేనని పేర్కొంది. వధించిన వెంటనే వ్యర్థాలను తొలగించి మాంసాన్ని తరలించాలని సూచించింది. వధశాలలో ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటించాలని విధిగా మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు. కరోనా లాడ్‌డౌన్‌ కారణంగా గత మూడు నెలల కారణంగా డియోనార్‌ వధశాలను మూసివేసిన సంగతి తెలిసిందే.


logo