శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 14, 2021 , 10:03:16

ఢిల్లీని వణికిస్తున్న చలి

ఢిల్లీని వణికిస్తున్న చలి

న్యూఢిల్లీ : ఉత్తరాదిని చలివణికిస్తోంది. ఢిల్లీ సహా పలునగరాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. మరో వైపు శీతలగాలులు వణికిస్తున్నాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) లోని కొన్ని ప్రాంతాల్లో గురువారం ఉదయం చలి తీవ్రత భారీగా పెరగగా.. దట్టమైన పొగమంచు కప్పివేసింది. గురువారం తెల్లవారుజామున జాతీయ రాజధానిలో కనిష్ఠ ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత 3.2గా నమోదైంది. మరికొన్ని చోట్ల ఉదయం 5:30 గంటలకు 4.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టమైన పొగమంచు కారణంగా ఎదురుగా ఉన్నవి ఏవీ కనిపించలేదు.


దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు చోట్ల దృశ్యమానత పది మీటర్ల కన్నా తక్కువగా ఉంది. బుధవారం పాలమ్‌, సఫ్దర్‌జంగ్‌ ప్రాంతాల్లో వరుసగా 4.6, 3.2 డిగ్రీల సెల్సియ్‌ వద్ద నమోదైంది. దట్టమైన పొగమంచు నగరాన్ని కప్పివేసింది. పొగమంచు ఢిల్లీలో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇదిలా ఉండగా.. జాతీయ రాజధానిలో గాలి నాణ్యత కూడా పడిపోయింది. సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (సఫర్) ‘చాలా పేలవంగా’ పేర్కొంది. రాబోయే రోజుల్లోనూ చల్లటి వాతావరణం ఉంటుందని, దట్టమైన పొగమంచు కప్పబడి ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉత్తర భారతదేశంలోని శీతల పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలెర్ట్‌ హెచ్చరిక జారీ చేసింది. logo