గురువారం 26 నవంబర్ 2020
National - Nov 15, 2020 , 17:59:42

పుంజుకున్న ఇంధన డిమాండ్... ఇదే కారణం...!

 పుంజుకున్న ఇంధన డిమాండ్... ఇదే కారణం...!

ఢిల్లీ :కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో మార్చి చివరి వారం నుంచి పడిపోయిన పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్ నెమ్మదిగా అన్-లాక్ తర్వాత పెరుగుతున్నది. ఇప్పుడిప్పుడే పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల డిమాండ్ జోరందుకుంటున్నది. అన్‌లాక్ తర్వాత డిమాండ్ క్రమంగా పెరుగుతున్నది. లాక్ డౌన్ సమయంలో ప్రజా రవాణా లేకపోవడంతో వాహనాల రాకపోకలు లేక డిమాండ్ కనిష్టానికి పడిపోయింది. ఏప్రిల్ నెలలో చమురు డిమాండ్ సగం క్షీణించింది. మే నుండి అన్-లాక్ ప్రారంభమయ్యాక ఇంధనానికి డిమాండ్ పెరుగుతూ స్తున్నది. నెలనెలా డిమాండ్ పెరిగినప్పటికీ, ఏడాది ప్రాతిపదికన మాత్రం తగ్గుదలను నమోదు చేసింది.   

జూలై-సెప్టెంబర్ కాలంలో పలు చమురు కంపెనీల కార్యకలాపాలు సగం వరకు నిలిచిపోయాయి. అక్టోబర్ నెలలో ఈ కార్యకలాపాలు 85శాతానికి చేరుకున్నాయి. గ్లోబల్ చమురు బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర గత శుక్రవారం స్వల్పంగా పడిపోయి బ్యారెల్ 43 మిలియన్ డాలర్లకు తగ్గింది. అయితే గత వారంలో మొత్తంగా 8 శాతం పెరిగింది. దసరా, దీపావళి పండుగ సీజన్ నేపథ్యంలో అక్టోబర్ నెలలో ఇంధన డిమాండ్ 2.7 శాతం జంప్ చేసి 17.8 మిలియన్ టన్నులుగా ఉంది. 2019లో ఇదే నెలలో 17.34 మిలియన్ టన్నుల ఇంధన వినియోగం ఉంది. కరోనా సంక్షోభం తర్వాత ఒక నెలలో ఏడాది ప్రాతిపదికన వృద్ధి నమోదు చేయడం ఇదే మొదటిసారి. అంతకుముందు ఫిబ్రవరిలో నమోదు చేసింది.

ఫిబ్రవరి తర్వాత ఏడు నెలల అనంతరం అంతకుముందు సంవత్సరంతో వృద్ధిని నమోదు చేసింది. పండుగ సీజన్ కావడంతో, ప్రజా సరుకు రవాణా వాహనాల రాకపోకలు పెరిగి, డీజిల్ వినియోగం కరోనా ముందుస్థాయికి చేరుకుంది. అలాగే వ్యక్తిగత రవాణా వల్ల పెట్రోల్ వినియోగం పెరిగి సెప్టెంబర్ నెలలోనే కరోనా ముందుస్థాయికి చేరుకుంది. అక్టోబర్‌లో రెండూ ఫిబ్రవరి స్థాయికి చేరుకున్నాయి. స్కూల్స్, కాలేజీలు ప్రారంభమైతే పెట్రోల్, డీజిల్ డిమాండ్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమల్లో విద్యుత్ ఉత్పత్తికి ఇంధనంగా, పెట్రో రసాయనాల తయారీకి వినియోగిస్తున్న నాఫ్తాకు డిమాండ్ 15 శాతం, రోడ్ల నిర్మాణాల్లో వాడే తారు వినియోగం 48 శాతం వృద్ధిని నమోదు చేసింది. వంట గ్యాస్ వినియోగం లాక్ డౌన్ సమయంలోను తగ్గలేదు. అక్టోబర్ నెలలో 2.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. విమానయాన సంస్థలు పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో జెట్ ఇంధన డిమాండ్ లో 50శాతమే పుంజుకుంది. ముద్దుతో ఇన్నిఉపయోగాలున్నాయా...?

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.