ఆదివారం 05 జూలై 2020
National - Jun 14, 2020 , 16:51:00

గోధుమలు, పప్పు ధాన్యాల పంపిణీని మరో ఆరు నెలలు పొడగించాలి : సీఎం అమరిందర్‌

 గోధుమలు, పప్పు ధాన్యాల పంపిణీని మరో ఆరు నెలలు పొడగించాలి : సీఎం అమరిందర్‌

పంజాబ్‌ : లాక్‌డౌన్‌ కాలంలో ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం కింద పేదలకు ఉచితంగా గోధుమలు, పప్పు ధాన్యాల పంపిణీని మరో ఆరు నెలలు పొడగించాలని కోరుతూ పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి ఆదివారం లేఖ రాశారు. కొవిడ్‌-19 సంక్షోభం దృష్య్టా నిరుపేదలకు పనులు లేవని, దీంతో వారి కడుపు నిండే పరిస్థితి లేదని ఆయన రాసుకొచ్చారు.  జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం లబ్ధిదారులందరికీ గోధుమలు, పప్పులు పంపిణీ చేయాలని లేఖలో కోరారు.


logo