శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 23:59:06

జూలై 20 నుంచి "జావా పెరక్‌ " బైక్స్ డెలివరీ లు ప్రారంభం

 జూలై  20 నుంచి

పూణె: ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోటార్‌సైకిల్‌గా జావా పెరక్ నిలిచింది‌. రోడ్ల మీద ఇది ఎప్పుడు తిరుగుతుందోననే వినియోగదారుల ఎదురుచూపులకు తెరదించింది ఆ సంస్థ. క్లాసిక్‌ లెజండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తమ పెరక్‌ డెలివరీలను జూలై 20 నుంచి దేశవ్యాప్తంగా తమ డీలర్‌షిప్‌ల వద్ద నుంచి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.  భారతదేశపు మొట్టమొదటి ఫ్యాక్టరీ కస్టమ్‌ వాహనంలో 334 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌, సింగిల్‌ సిలెండర్‌, ఫోర్‌ స్ట్రోక్‌, డీఓహెచ్‌సీ ఇంజిన్‌ ఉంది. ఇది 30.64 పీఎస్‌ శక్తిని , 32.74 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిగ్నేచర్‌ ట్విన్‌ జావా ఎగ్జాస్ట్స్‌తో శ్వాసిస్తుంది. 

బీఎస్‌6 ప్రమాణాలు కలిగిన ఈ వాహనం అసలైన బాబర్‌గా బాబ్డ్‌ ఫెండర్స్‌, స్మూత్ సీటు తోపాటు, టార్మక్‌కు  6స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌ ద్వారా అందించడంతో పాటుగా గేర్ల ద్వారా అసాధారణ సవారీ అనుభవాలను అందిస్తుంది. జావా పెరక్‌ను ఆవిష్కరించిన అనంతరం అనుపమ్‌ థరేజా, కో–ఫౌండర్‌, క్లాసిక్‌ లెజండ్స్‌ మాట్లాడుతూ ‘‘పెరక్‌ను నిర్మించాలని మేము అనుకున్నప్పుడు మా లక్ష్యం చాలా సరళంగా ఉంది. సినిస్టర్‌ , డార్క్‌ సూచనతో ప్రత్యేక పనితీరు, సరైన రీతిలో మోటార్‌సైకిల్‌ను తయారుచేయాలనుకున్నాం" అని అన్నారు.


logo