గురువారం 16 జూలై 2020
National - Jun 24, 2020 , 18:46:43

ఢిల్లీలో 70వేలు దాటిన కరోన కేసులు

ఢిల్లీలో 70వేలు దాటిన కరోన కేసులు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. 24 గంటల్లో 3788 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 70,390 పాజిటివ్‌ కేసులు నమోదవగా, బుధవారం వైరస్‌తో 64 మంది చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 2365కు చేరింది. 41,437 మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 26,588 మంది ఢిల్లీలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.


logo