బుధవారం 08 జూలై 2020
National - Jun 21, 2020 , 18:31:13

జైలులో మృతి చెందిన ఖైదీ.. పోస్టుమార్టంలో కరోనా పాజిటివ్‌

 జైలులో మృతి చెందిన ఖైదీ.. పోస్టుమార్టంలో కరోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ : ఆరురోజుల క్రితం ఢిల్లీలోని మండోలి జైలులో మృతి చెందిన ఖైదీకి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. పోస్టుమార్టం నివేదికలో ఈ విషయం స్పష్టమైనట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. 2016లో జరిగిన ఓ హత్య కేసులో కన్‌వర్‌ సింగ్‌ (62) అనే ఖైదీ మండోలీ జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. సీనియర్‌ సిటిజన్స్‌కు కేటాయించిన సీజే-14బ్యారక్‌లో మరో 28మందితో కలిసి కన్‌వర్‌ సింగ్‌ ఉంటున్నాడు.

జూన్‌ 15న ఉన్నట్టుండి నిద్రలోనే మృతి చెందాడు. మృతిగల కారణాలు తెలియకపోవడంతో మృతదేహానికి  పోస్టుమార్టం నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో బ్యారక్‌లో ఉంటున్న అందరూ ఖైదీలకు కరోనా నిర్ధారణ పరీక్ష చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ జైలులో ఇప్పటి వరకు 29మంది ఖైదీలు కరోనా బారినపడగా 16మంది మృతి చెందారు. అధికారులు, సిబ్బందితో కలిపి మొత్తం 43మందికి పాజిటివ్‌ రాగా ఏడుగురు సిబ్బంది చనిపోయారు.


logo