మంగళవారం 14 జూలై 2020
National - Jun 16, 2020 , 13:25:15

ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా నెగిటివ్‌

ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా నెగిటివ్‌

న్యూఢిల్లీ : ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌కు కరోనా నెగిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ జ్వరంతో బాధపడుతున్నాడు. నిన్న రాత్రి నుంచి జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న సత్యేందర్‌ జైన్‌.. ఢిల్లీలోని రాజీవ్‌ గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. మంగళవారం ఉదయం ఆయన నుంచి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలు నిర్వహించగా, కరోనా నెగిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఆయన కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి త్వరగా కోలుకోవాలని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రార్థించారు.

గత వారం సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు కూడా జ్వరం, గొంతు నొప్పి రావడంతో.. కరోనా టెస్టులు చేయించుకున్న విషయం విదితమే. కానీ కేజ్రీవాల్‌కు కరోనా నెగిటివ్‌ వచ్చింది. అయితే నిన్న ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి సత్యేందర్‌ జైన్‌ హాజరయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, సీఎం కేజ్రీవాల్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.


logo