బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 06, 2020 , 10:46:50

తెరుచుకున్న ఢిల్లీ హజ్రత్‌ నిజాముద్దీన్‌ దర్గా

తెరుచుకున్న ఢిల్లీ హజ్రత్‌ నిజాముద్దీన్‌ దర్గా

న్యూఢిల్లీ : ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ఆలియా దర్గాను భక్తుల సందర్శనార్థం ఆదివారం ఉదయం 5 గంటలకు తెరిచారు. కోవిడ్‌-19 వైరస్ నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా దర్గా సందర్శనకు విశ్వాసకులను అనుమతించారు. దర్గాను పూర్తిగా శానిటైజ్‌ చేసి ఆవరణలో భక్తులు సామాజిక దూరం పాటించేలా గుర్తులు ఏర్పాటు చేశారు.

మాస్క్‌లు ధరించి వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. చేతులు శుభ్రం చేసుకునేందుకు ప్రతి మూల శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి నుంచి దర్గా మూతపడింది. ఇటీవల కేంద్ర జారీ చేసిన అన్‌లాక్‌-4 మార్గదర్శకాలకు అనుగుణంగా దర్గాను తెరిచినట్లు దర్గా ఇన్‌ఛార్జ్ సయ్యద్ అదీబ్ నిజామి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo