కొవిడ్-19 వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని అందరూ తరచూ చేతులు కడుక్కుంటున్నారు. శానిటైజర్లను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. దానివల్ల చర్మం పొడిబారి కాంతిహీనంగా మారుతున్నది. అలాగే దురద, ముడతలు వంటి సమస్యలూ ఎదురవుతున్నాయి. కాబట్టి, హ్యాండ్‌వాష్‌తో చేతులు కడుక్కున్నా, శానిటైజర్ రాసుకున్నా తప్పనిసరిగా మాయిశ్చరైజర్ పూసుకోవడం మంచిదంటున్నారు కాస్మొటాలజిస్ట్లు. అయితే, చర్మరక్షణ కోసం వాడే ప్రొడక్ట్స్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అందులో వాడుతున్న పదార్థాలను గమనించాలి. ప్రొడక్ట్‌పై రసాయనాల చిట్టా పెద్దగా కనిపిస్తే వాటిని కొనొద్దు. వాటితో చర్మ సమస్యలను కొనితెచ్చుకున్నట్లు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటి వాడకం వల్ల తాత్కాలిక ఉపశమనం లభించినా దీర్ఘకాలంలో సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అందుకే, చర్మానికి సంబంధించి హెర్బల్ ప్రొడక్ట్స్ వాడితే మంచిదంటున్నారు. వీటివల్ల చర్మాన్ని సంరక్షించుకోవడంతోపాటు ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవని చెబుతున్నారు. కింద పేర్కొన్న ఉత్పత్తులను ప్రయత్నించొచ్చని వారు సూచిస్తున్నారు.