శనివారం 16 జనవరి 2021
National - Jan 13, 2021 , 08:45:44

ఢిల్లీలో మ‌రింత పెరిగిన కాలుష్యం

ఢిల్లీలో మ‌రింత పెరిగిన కాలుష్యం

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాలుష్యం అంత‌కంత‌కే పెరిగిపోతున్న‌ది. ప‌రిశ్ర‌మ‌లు, వాహ‌నాల నుంచి వెలువ‌డే పొగ కార‌ణంగా న‌గ‌రంలో గాలి నాణ్య‌త రోజురోజుకు క్షీణిస్తున్న‌ది. ఈ కాలుష్యానికి తోడు రోజు ఉద‌యాన్నే భారీగా మంచు కురుస్తుండ‌టంతో ఢిల్లీ వాసి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. దుమ్ము, ధూళితో మంచు క‌లిసిపోయి ఢిల్లీ అంత‌‌టా ద‌ట్ట‌మైన పొగ‌మంచు క‌మ్ముకుంటున్న‌ది. దీంతో ఉద‌యం 10, 11 గంట‌ల వ‌ర‌కు రోడ్ల‌పై ఏమీ క‌నిపించ‌ని ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. క‌నీసం 50 మీట‌ర్ల దూరం కూడా క‌నిపించ‌క వాహ‌నదారులు ఇబ్బందులు ప‌డుతున్నారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.