మంగళవారం 26 మే 2020
National - May 09, 2020 , 16:37:56

ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్‌ మాలివాల్‌కు బెదిరింపులు

ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్‌ మాలివాల్‌కు బెదిరింపులు

హైదరాబాద్: ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్‌కు చంపేస్తానని బెదరింపులు రావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాయిస్ లాకర్‌రూం, జామియా మిలియా విద్యార్థిని సఫూరా జర్గర్ గర్భం దాల్చడం వంటి అంసాలపై ఆమె ఇటీవల తన అభిప్రాయాలను ట్విట్టర్‌లో నిర్మొహమాటంగా వెల్లడించారు. దాంతో కొందరు ఆమెను విమర్శిస్తూ ఆమె ట్విట్టర్ ఖాతాలో చంపేస్తామని బెదరింపు సందేశాలు పోస్ట్ చేశారు. ఒక వ్యక్తి చాలా తీవ్ర పదజాలంతో హెచ్చటరికలు చేశాడని మాలివాల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. వారిని వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.


logo