శనివారం 04 జూలై 2020
National - Jun 26, 2020 , 14:53:55

కరోనా కేసుల్లో ముంబైను దాటిన ఢిల్లీ

కరోనా కేసుల్లో ముంబైను దాటిన ఢిల్లీ

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు కరోనా తీవ్రత పెరుగుతోంది. ఇప్పటికే పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరుగుతుండగా.. తాజాగా కరోనా కేసుల్లో ముంబైను దాటేసింది ఢిల్లీ. రెండు కోట్లకు పైగా జనాభా ఉన్న ముంబైలో కొవిడ్‌ కేసుల సంఖ్య 70878 ఉండగా, మరణాల సంఖ్య 4,062 ఉంది. కోటిన్నరకు పైగా జనభా ఉన్న దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివ్‌ కేసులు 73,780 నమోదవగా.. మరణాల సంఖ్య 2,429గా ఉంది. దీనిని బట్టి చూస్తే ఢిల్లీలో కరోనా మహ్మమారి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఢిల్లో మొదటి కరోనా కేసు మార్చిలో నమోదవగా.. నేటికి 26,586 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

గత వారంలో ఢిల్లీలో 3,320 కేసులు నమోదు కాగా.. మొంబైలో 1,134గా కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా బారి నుంచి ముంబై నగరం బయటపడే ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీలో కరోనా కట్టడికి కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ చర్చల అనంతరం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కొవిడ్‌ రెస్పాన్స్‌ ప్లాన్‌ విధానాన్ని అమలుకు చర్యలు చేపట్టింది. ఈ విధానంలో జూలై 6 లోపు ఢిల్లీలోని ప్రతి ఇంట్లో కొవిడ్‌ పరీక్షలు చేయనున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా.. కేసులు సంఖ్య మాత్రం తగ్గడంలేదు.logo