బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 03, 2020 , 02:25:15

ప్రభుత్వ ప్రాయోజిత హత్యాకాండ!

ప్రభుత్వ ప్రాయోజిత హత్యాకాండ!

కోల్‌కతా: ఢిల్లీలో చెలరేగిన మత కార్చిచ్చు.. ‘పథకం ప్రకారం జరిగిన ప్రభుత్వ ప్రాయోజిత మారణకాండ’ అని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత ఆరోపించారు. దేశవ్యాప్తంగా ‘గుజరాత్‌ తరహా అల్లర్లకు’ బీజేపీ కుట్ర పన్నుతున్నదని ధ్వజమెత్తారు. సోమవారం కోల్‌కతాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆదివారం అమిత్‌షా చేపట్టిన ర్యాలీలో కొందరు ‘గోలీ మారో’ అంటూ నినాదాలు చేయడాన్ని ఖండించారు. ఇది ఢిల్లీ కాదు.. బెంగాల్‌ అని, పోలీసులు వదిలిపెట్టరని హెచ్చరించారు.  ఢిల్లీ బాధితుల కోసం విరాళాలు సేకరించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 


‘బెంగాల్‌కు గర్వకారణం.. మమత’

వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ను గెలిపించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న  వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ప్రచార నినాదాన్ని రూపొందించారు. ‘బెంగాల్‌కు గర్వకారణం.. మమత’ అన్న అర్థం వచ్చేలా‘బంగ్లార్‌ గొర్బో మమత’ నినాదానికి రూపకల్పన చేశారు.


logo