శుక్రవారం 05 మార్చి 2021
National - Jan 27, 2021 , 15:56:35

ప‌క్కా కుట్ర‌తోనే ఢిల్లీలో హింస‌: దిగ్విజ‌య్ సింగ్

ప‌క్కా కుట్ర‌తోనే ఢిల్లీలో హింస‌: దిగ్విజ‌య్ సింగ్

న్యూఢిల్లీ: వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నాడు ఢిల్లీలో రైతులు నిర్వ‌హించిన ట్రాక్ట‌ర్ ర్యాలీలో ప‌క్కా కుట్ర‌తోనే హింస చెల‌రేగింద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ ఆరోపించారు. మంగ‌ళ‌వారం ఘాజీపూర్ స‌రిహ‌ద్దుల్లో రైతుల ట్రాక్ట‌ర్ ర్యాలీకి అనుమతించిన మార్గంలో పోలీసులు బారీకేడ్ల‌ను అడ్డంపెట్టార‌ని.. దాంతో రైతుల‌కు, పోలీసులకు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంద‌ని దిగ్విజ‌య్ చెప్పారు. ఆ ఘ‌ర్ష‌ణే  ఆ త‌ర్వాత మ‌రింత హింసకు దారితీసింద‌న్నారు.

కాగా, మంగ‌ళవారం ఆందోళ‌న‌కారుల్లో క‌లిసి హింస‌కు పాల్పడిన 15 మందిని రైతులు ప‌ట్టుకున్నార‌ని, వారంద‌రి ద‌గ్గ‌ర ప్ర‌భుత్వ గుర్తింపు కార్డులు ఉన్నాయ‌ని దిగ్విజ‌య్‌సింగ్ చెప్పారు. దీన్నిబ‌ట్టే ప్ర‌భుత్వంలో ఎలాంటి వ్య‌క్తులు ఉన్నారో మీరే గ‌మ‌నించాల‌ని మీడియాను ఉద్దేశించి దిగ్విజ‌య్ వ్యాఖ్యానించారు. శాంతియుతంగా కొన‌సాగుతున్న రైతుల ఉద్య‌మంపై బుర‌ద‌జ‌ల్ల‌డానికి ప‌క్కా ప్లాన్‌తో కుట్ర చేశార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo