సోమవారం 30 మార్చి 2020
National - Mar 04, 2020 , 02:13:28

79 ఇండ్లు, 327 దుకాణాలు బూడిద

79 ఇండ్లు, 327 దుకాణాలు బూడిద
  • ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా వెల్లడి

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో జరిగిన మత ఘర్షణల్లో 79 ఇండ్లు, 327 దుకాణాలు పూర్తిగా దహనమయ్యాయని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా వెల్లడించారు. 79 ఇండ్లు పూర్తిగా, 168 ఇండ్లు గణనీయ స్థాయిలో, 40 ఇండ్లు స్వల్పంగా దెబ్బ తిన్నాయని ఆయన సోమవారం సాయంత్రం మీడియాకు చెప్పారు.  హింసాకాండలో అధికారిక పత్రాలను కోల్పోయిన వారు సమీప ఎస్డీఎంలను సంప్రదించాలని, వారికి తగిన సాయం అందుతుందన్నారు. మరోవైపు, ఢిల్లీలోని మౌజిపూర్‌లో అల్లర్ల సందర్భంగా నిరాయుధుడైన పోలీసుపైకి తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తిని షారూఖ్‌గా పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతడ్ని అరెస్ట్‌ చేసి ఢిల్లీకి తరలించారు. పోలీసుల ముందే ప్రజలపై అతడు ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపాడు. కాగా, ‘ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవస్థీకృత హింసకు పాల్పడడం ఖండనార్హం’ అని ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావద్‌ జరీఫ్‌ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. ఇరాన్‌ స్పందన అవాంఛనీయమని పేర్కొంది. భారత్‌లోని ఇరాన్‌ రాయబారిని పిలిపించి నిరసన తెలియజేసింది. ఇరాన్‌ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని వ్యాఖ్యానించింది. 


logo