సోమవారం 23 నవంబర్ 2020
National - Oct 28, 2020 , 18:10:25

ఢిల్లీ యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్‌పై స‌స్పెన్ష‌న్ వేటు

ఢిల్లీ యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్‌పై స‌స్పెన్ష‌న్ వేటు

ఢిల్లీ : ఢిల్లీ విశ్వ‌విద్యాల‌యం వైస్ ఛాన్సలర్‌పై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింది. దుష్ప్రవర్తనే ఇందుకు కార‌ణంగా స‌మాచారం. నియామ‌కాల‌పై త‌లెత్తిన వివాదాల నేప‌థ్యంలో వీసీ యోగేశ్ త్యాగీని స‌స్పెండ్ చేస్తూ రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఉత్త‌ర్వులు వెలువ‌రించారు. గత వారం విశ్వవిద్యాలయానికి సంబంధించి జ‌రిగిన‌ రెండు నియామకాలపై వివాదం నేప‌థ్యంలో వైస్ ఛాన్సలర్‌పై విచారణకు అనుమతించాలని విద్యా మంత్రిత్వశాఖ రాష్ట్రపతిని కోరింది. వీసీ ప‌ద‌విలో ఉంటే ద‌ర్యాప్తు ప్ర‌భావితం అయ్యే అవ‌కాశం ఉందంది. విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కు స‌స్పెండ్ చేయాల్సిందిగా విన్న‌వించింది. ఈ నేప‌థ్యంలో వైస్ ఛాన్సలర్‌పై చ‌ర్య‌ల‌కు రాష్ర్ట‌ప‌తి అనుమతి తెలిపారు. అంత‌వ‌ర‌కు ప్రొఫెస‌ర్ పీసీ జోషి వీసీగా బాధ‌త్య‌లు నిర్వ‌హించ‌నున్నారు.