సోమవారం 01 జూన్ 2020
National - May 14, 2020 , 17:26:07

జూలై 1 నుంచి ఢిల్లీ యూనివ‌ర్సిటీ యూజీ, పీజీ ప‌రీక్ష‌లు

జూలై 1 నుంచి ఢిల్లీ యూనివ‌ర్సిటీ యూజీ, పీజీ ప‌రీక్ష‌లు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కార‌ణంగా ఇన్నాళ్లు వాయిదాప‌డ్డ ఢిల్లీ యూనివ‌ర్సిటీ యూజీ, పీజీ ప‌రీక్ష‌లు జూలై 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు యూనివ‌ర్సిటీ అధికారులు గురువారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఢిల్లీ యూనివ‌ర్సిటీలో రిజిస్ట‌ర్ చేసుకున్న అన్ని బోర్డుల‌ విద్యార్థులకు జూలై 1 నుంచే ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. అంటే స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ (SOL), నాన్ కొలీజియేట్ వుమెన్ ఎడ్యుకేష‌న్ బోర్డు (NCWEB)  విద్యార్థుల‌కు కూడా జూలై 1 నుంచే ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టంచేశారు. 

అయితే అన్ని ప‌రీక్ష‌లు ప్ర‌తిరోజు మూడు సెష‌న్ల‌లో జ‌రుగుతాయ‌ని తెలిపారు. మ‌రోవైపు ప‌రీక్ష వ్య‌వ‌ధిని కూడా మూడు గంట‌ల నుంచి రెండు గంట‌ల‌కు త‌గ్గించిన‌ట్లు వెల్ల‌డించారు. ఏ ప‌రీక్ష ఏ తేదీలో ఉంటుందనే వివ‌రాల‌తో కూడిన షెడ్యూల్‌ను మే నెలాఖ‌రుక‌ల్లా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు యూనివ‌ర్సిటీ అధికారులు తెలిపారు.   logo