ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 21:06:10

ఢిల్లీలో కంటైన్‌మెంట్‌ జోన్‌ను పరిశీలించిన రవాణాశాఖ మంత్రి

ఢిల్లీలో కంటైన్‌మెంట్‌ జోన్‌ను పరిశీలించిన రవాణాశాఖ మంత్రి

న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని అతిపెద్ద కంటైన్‌మెంట్‌ జోన్‌ రాజ్‌నగర్‌ను శుక్రవారం ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ పరిశీలించారు. అనంతరం అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రభుత్వం రాజ్‌నగర్‌ కంటైన్‌మెంట్‌ జోన్‌ పరిధిని తగ్గించే యోచనలో ఉందని, త్వరలో ఇక్కడి ప్రజలు సాధారణ జీవనాన్ని కొనసాగిస్తారని  పేర్కొన్నారు. ఈ  జోన్‌పరిధిలో సుమారు 40 వేల మందికిపైగా నివసిస్తున్నారని, ఆంక్షలు అమలులో ఉండడంతో వీరంతా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 1195 కరోనా కేసులు నమోదు కాగా మహమ్మారి బారినుంచి కోలుకొని 1206 మంది డిశ్చార్జి కాగా 27 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య బులిటెన్లో పేర్కొంది. ఇప్పటివరకు ఢిల్లీలో  1.3 లక్షల మంది కరోనా బారినపడగా లక్షా 20 వేల మందికిపైగా కోలుకున్నారు. 10 మందికిపైగా దవాఖానలో చికిత్స పొందుతుండగా 3,963 మంది మృత్యువాత పడ్డారు.


logo