సోమవారం 18 జనవరి 2021
National - Dec 20, 2020 , 21:57:49

ఢిల్లీలో 6.17 లక్షలు దాటిన కరోనా కేసులు

ఢిల్లీలో 6.17 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 6.17 లక్షలు దాటింది. మరణాల సంఖ్య పది వేలకుపైగా ఉన్నది. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 1,091 కరోనా కేసులు, 26 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,17,005కు, మరణాల సంఖ్య 10,277కు చేరింది. గత 24 గంటల్లో 1,275 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 5,96,580కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఢిల్లీలో ప్రస్తుతం 10,148 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.