న్యూఢిల్లీ : షాపింగ్ చేసేవారిని ఇట్టే ఆకట్టుకునే వార్త ఇది. ప్రస్తుతానికి ఇది ఢిల్లీలో అందుబాటులోకి వచ్చింది. రాజధానిలో ‘క్యారీమెన్’ అనే స్టార్టప్ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘మీరు షాపింగ్ చే యండి. మీ బ్యాగులను మేము మోస్తాం’ అనే నినాదంతో ఈ కంపెనీ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. షాపింగ్ చేసే సమయంలో బ్యాగులు మోయడానికి శిక్షణ పొందిన, వృత్తిపరమైన సహాయకులను ఈ సంస్థ అందిస్తుంది.
అలాగే మార్కెట్లో తోడుగా ఉండటం, పార్కింగ్ ఏరియా లేదా మెట్రో స్టేషన్ వరకూ రావడం, ఆహారం కోసం క్యూలైన్లో సహాయపడటం తదితర సేవలను వీరు అందిస్తారు. బేబీ క్యారియర్లు, బేబీ ఫ్రామ్స్, ఎన్ 95 మాస్కులు, మొబైల్ చార్జింగ్, గొడుగులు, ఫోల్డబుల్ సీటింగ్ తదితర సౌకర్యాలను కూడా వీరి నుంచి పొందవచ్చు. ఈ సేవలను పొందేందుకు ‘క్యారీమెన్’ వివిధ ప్యాకేజీలను రూపొందించింది.