ఆదివారం 17 జనవరి 2021
National - Dec 05, 2020 , 21:34:11

ఢిల్లీలో కొత్తగా 3,419 కరోనా కేసులు.. 77 మరణాలు

ఢిల్లీలో కొత్తగా 3,419 కరోనా కేసులు.. 77 మరణాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్తగా నాలుగు వేల లోపు కరోనా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు గత 24 గంటల్లో 3,419 పాజిటివ్‌ కేసులు రిపోర్టు కాగా 77 మరణాలు సంభవించాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,89,544కు, మొత్తం మరణాల సంఖ్య 9,574కు పెరిగింది. కాగా, గత 24 గంటల్లో 4,916 మంది రోగులు కోలుకున్నారు. దీంతో ఢిల్లీలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 5,53,292కు చేరినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 26,678 యాక్టివ్ ‌కేసులు ఉన్నట్లు పేర్కొంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి