మంగళవారం 07 జూలై 2020
National - Jun 27, 2020 , 19:37:42

ఢిల్లీలో కొత్తగా 2,948 కరోనా కేసులు

ఢిల్లీలో కొత్తగా 2,948 కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశరాజధానిలో శనివారం ఒక్కరోజే కొత్తగా 2,948 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 80,188 కేసులు నమోదయ్యాయని వీటిలో 28,329 పాజిటివ్‌ కేసులున్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం తన హెల్త్‌ బులిటెన్లో వెల్లడించింది. 24గంటల వ్యవధిలో 66మంది మృతి చెందగా ఇప్పటి వరకు 2,558మంది మృతి చెందినట్లు పేర్కొంది. శనివారం 2,210మంది దవాఖానల నుంచి డిశ్చార్జి కాగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 49,301కి చేరింది. రాష్ట్రంలో 24గంటల వ్యవధిలో 4,73,336 శ్యాంపిళ్లను పరీక్షించగా 19,180 శ్యాంపిళ్లు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో 315 కంటైన్‌మెంట్‌ జోన్లున్నాయి.logo