సోమవారం 28 సెప్టెంబర్ 2020
National - Aug 09, 2020 , 16:46:33

ఢిల్లీలో కొత్తగా 1300 కరోనా కేసులు.. 13 మరణాలు

ఢిల్లీలో కొత్తగా 1300 కరోనా కేసులు.. 13 మరణాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. కరోనా కేసులు, మరణాల నమోదు సంఖ్య తగ్గుతున్నది. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 1300 పాజిటివ్ కేసులు నమోదు కాగా 13 మంది మరణించారు. దీంతో ఢిల్లీలో కరోనా కేసుల మొత్తం సంఖ్య 1,45,427కు, చనిపోయిన వారి సంఖ్య 4,111కు చేరింది. ఇప్పటి వరకు 1,30,587 మంది కరోనా రోగులు కోలుకున్నారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 10,729 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. గత 24 గంటల్లో 5,702 ఆర్టీపీసీఆర్, 18,085 ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. దీంతో ఢిల్లీలో ఇప్పటి వరకు 11,92,082 కరోనా పరీక్షలు జరిపినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వివరించింది.
logo