బుధవారం 23 సెప్టెంబర్ 2020
National - Aug 12, 2020 , 18:00:02

ఢిల్లీలో కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు

ఢిల్లీలో కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం కొత్తగా 1,133 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. అలాగే వైరస్‌ నుంచి మరో 1021 మంది రోగులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లో మరో 14 మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 1,48,504కి చేరగా, వీటిలో 1,33,405 రికవరీ కేసులున్నాయి. వైరస్‌ ప్రభావంతో మొత్తం 4,153 మంది మరణించారు. కాగా, దేశ‌వ్యాప్తంగా 60,963 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య  23,39,639కి చేరింది. ఇందులో 6,43,948 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 16,39,600 మంది బాధితులు కోలుకున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి బుధవారం వరకు క‌రోనాతో కొత్తగా  834 మంది మరణించగా, మృతుల సంఖ్య 46,091కి చేరాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo